నింగి నేల పాడినా
కమ్మనైన పాటవా
వెన్నెలింట ఆడినా
అందమైన ఊహవా
నలువైపులా వేనుగానమా
కనుసైఘలా ప్రేమకావ్యమా
చిరుగాలులా సుగందమా
ఇలచేరిన వాసంతమా
కన్నులు సైతం నమ్మని రూపమా
కవితలు సైతం తెలుపని బావమా
వన్నెల చిన్నెల వెలుగుల సంద్రమా
అన్నుల మిన్నుల వలపుల బందమా
మునుపెరుగని సౌందర్యమా
తలపెరుగని ఆనందమా
రవిచూడని నవవర్నమా
ఉలి ఎరుగని తొలిస్వర్నమా
కన్ను మిన్ను కానని
అందమైన స్వప్నమా
నిన్న మొన్న లేధని
వ్యక్తమైన సత్యమా
1 comment:
బాగుందండి.
Post a Comment