Monday, May 24, 2010

నా మౌనం...

మాట్లాడాలని ఉన్నా... నే మౌనం గా నిలుచున్నా
నిను చూడాలని ఉన్నా... నే శూన్యంలొ చూస్తున్నా
మనసే కొరుకున్నా, నీకై వేడుకున్నా,
నువ్వే దక్కవన్న నిజమే చెప్పుకున్నా
నే నాలొనే ఆశలన్ని దాచుకున్నా

Saturday, April 25, 2009

నీ చిరునవ్వులో ఎంతొ హాయిలే
నీ ప్రతి పలుకులో ఏదొ మాయలే
నాకే తెలియని మునుపే యెరుగని
ఆనందాలివే

నీ ప్రతి అడుగులో తొడై సాగనా
నీ ప్రతి ఊసులో నేనే చేరనా
హద్దే ఎరుగని అంతే తెలియని
వాసంతాలివే

నిను చూస్తూనే సాగే వరమే
నిన్నే అడగాలా
నీ తొడుంటూ బ్రతికే క్షణమే
యుగమే కావాలా
నీ కౌగిలిలొ కరిగే వరకు
తపమే చెయ్యాలా
నీ అడుగులలొ అడుగులు వెస్తూ
పయనం సాగాలా

నీ చిరునవ్వులో ఎంతొ హాయిలే
నీ ప్రతి పలుకులో ఏదొ మాయలే
నాకే తెలియని మునుపే యెరుగని
ఆనందాలివే

Saturday, February 7, 2009

లేవు కదా ఇక రావు కదా

నేరం నా కల్లదే నిను చూడగా
దొషం నా కలలదే నిను కొరగా
నేరం నా వయసుదే నిను కలవగా
పాపం నా మనసుదే నిను తలవగా

లేవు కదా ఇక రావు కదా
నా తలపులనే విడి పొవు కదా
ప్రేమ కధ ఇక లేదు కదా
తొలి వలపులకే వీడ్కోలు సదా

ఘోరం నా పయనమే నిను వీడాక
శాపం నా కధనమే నువు తొలిగాక
ఘోరం విధి వైణమే ఈ తీరుగా
శాపం మన కలయికే విరహాలుగా

లేవు కదా ఇక రావు కదా
నా తలపులనే విడి పొవు కదా
ప్రేమ కధ ఇక లేదు కదా
తొలి వలపులకే వీడ్కోలు సదా

Thursday, July 26, 2007

ప్రేమని లేదని

ప్రేమని లేదని చెప్పలేను
నా లొ ఆశల అలజడిది
నేనని నీవని చెప్పలేను
ఏవొ కొర్కెల ఒరవడిది

వెండి వాన కై వేచిన భూమి ని నెనే
మండుటెండలొ మెరిసిన చినుకై రావే

నేటిని రేపుని నమ్మలేను
కాలం తెలియని సందడిది
రాతని గీతని నమ్మలేను
హౄదయం యెరుగని పండగిది

రెండు కన్నుల నిండిన కలవే నీవే
నిండు గుండెలొ మండిన వ్యదవే నీవే
నా దారిని మరిచి నీ వైపే సాగానే

నీ పెరుని తలిచి ప్రతి పూట గడిపానే

నా గమ్యం నీవని నేనెంతొ మురిసానే
ప్రతి మార్గం నీ గురుతై ప్రతి అదుగు వేసానే

ప్రేమని లేదని చెప్పలేను
ఏదొ తీయని గొడవిది
నెనని నీవని చెప్పలేను
నీడై వీడని చొరవిది

వెండి వెన్నెలే కొరిన సాగరం నేనే
వెచ్చని వెలుగులు కురిపించి పొవే

నేటిని రేపుని నమ్మలేను
గాలం వేసిన ప్రణయమిది
రాతని గీతని నమ్మలేను
రాగం మార్చిన చరనమిది

Thursday, July 5, 2007

కనిపిస్తే... కలిసొస్తే...

మల్లీ నీ తలపులు గిల్లే
తుల్లీ ఆ కలలే చేరే
సరి గమ పద నిస రాగాలేవో కవితలు సాగి
తక దిమి తక జను నాట్యాలాయే అడుగులు నావి

ఇక లేవని కనరావని అనుకున్నానే
కల నిజమని కలవరముని కనుగొన్నానే

కనుమరుగై కలతేదొ రేపావు
చిరు వరమై కన్నీటిని తుడిచావు
ఒక మెరుపై మయిమరుపై వెలిగావు
తొలకరివై తొలి చినుకై కురిసావు
మదుమాసపు సిరులెన్నొ తెచ్చావు
మరుమల్లెల పరిమలాలు చల్లావు


కనిపిస్తే కలలొస్తే మురిసే మనసే
నువ్వు కదిలొస్తే కలిసొస్తే అలలా యెగసే

క్షణమైన సహవాసము కొరాను
నాతొనే బ్రతుకంతా అన్నావు
కడ వరకు ఉంటావని చేరావు
చీకటిలొ చిరుదివ్వెలా వెలిగావు
సతకొటి దీపలే చూపవు
కనులెదుట స్వర్గాన్నే నిలిపవు

మల్లీ నీ తలపులు గిల్లే
మరు జన్మలొ నీ తొడే కొరే
సరి గమ పద నిస రాగాలేవో కవితలు సాగి
తక దిమి తక జను నాట్యాలాయే అదుగులు నావి

Friday, May 11, 2007

చెలి కన్నుల

చెలి కన్నుల కల నేనేనా
తన నవ్వుల కధ నాదేనా
సిరిమువ్వల చిరు సవ్వడిలో
రాగాలే వినిపించేనా

తెలిపీ తెలుపక మౌనం వీదక
ఆటలు ఆదే నెచ్చెలి
విరిసీ విరియక ప్రణయం మొదలిక
మాయలు చాలే ప్రేయసి

కురిసీ కురవక మెఘం కదలక
దారే ఎరుగక నిలిచితీ
తొడూ నీడగ నాతొ ఉండక
పంతం యెందుకే ప్రేయసి

అందీ అందక అందం అందేనా
వెంటనే వీడి పొయేనా
అంటీ అంటక బందం వేసెనా
కలతే నింపీ పొయేనా

చెలి నీ కన్నుల కల నేనేనా
చిరునవ్వుల కధ మనదేనా
సిరిమువ్వల చిరు సవ్వడిలో
రాగాలే వినిపించేనా

కాసేపు కనరావా

కాసేపు కనరావా కాస్తైన బాధ తీర్చవా
ఓ మారు ఇటు రావా నేడైన తొడు ఉండవా

నువ్వు రాక చంద్రుడు లేడు,
మబ్బులు చినుకై రాలేదు,
చిన్నబొయి ఆ సూరీడు,
నీ కొసం వడగాలై వేగేడు

పిలవ లేక వయసే ఆగే,
ఆగ లేక మనసే రేగే,
రేగి పొయే ఆశే నేడే,
నీకై వెతికీ అలిసి పొయే

నా గోడు వినలేవా రాయిలా మారిపొయావా
బాసలే మరిచిపొయావా మొడులా మిగిలిపొయావా

నిను తలచి కలలు చూసాను,
కలలొ తెగ మురిసిపొయాను,
కౌగిలిలొ కరిగిపొయాను,
కలని తెలిసి కృంగిపొయాను.

నిను మరిచి బ్రతుకుదామన్నా,
ప్రతి క్షణము నరకతుల్యము
నిను విడిచి సాగుదామన్న
ప్రతి కదలిక కన్నీటి రాగము.
కాసేపు కనరావా కాస్తైన బాధ తీర్చవా
ఓ మారు ఇటు రావా నేడైన తొడు ఉండవా