Friday, May 11, 2007

కాసేపు కనరావా

కాసేపు కనరావా కాస్తైన బాధ తీర్చవా
ఓ మారు ఇటు రావా నేడైన తొడు ఉండవా

నువ్వు రాక చంద్రుడు లేడు,
మబ్బులు చినుకై రాలేదు,
చిన్నబొయి ఆ సూరీడు,
నీ కొసం వడగాలై వేగేడు

పిలవ లేక వయసే ఆగే,
ఆగ లేక మనసే రేగే,
రేగి పొయే ఆశే నేడే,
నీకై వెతికీ అలిసి పొయే

నా గోడు వినలేవా రాయిలా మారిపొయావా
బాసలే మరిచిపొయావా మొడులా మిగిలిపొయావా

నిను తలచి కలలు చూసాను,
కలలొ తెగ మురిసిపొయాను,
కౌగిలిలొ కరిగిపొయాను,
కలని తెలిసి కృంగిపొయాను.

నిను మరిచి బ్రతుకుదామన్నా,
ప్రతి క్షణము నరకతుల్యము
నిను విడిచి సాగుదామన్న
ప్రతి కదలిక కన్నీటి రాగము.
కాసేపు కనరావా కాస్తైన బాధ తీర్చవా
ఓ మారు ఇటు రావా నేడైన తొడు ఉండవా

No comments: