Friday, April 27, 2007

నింగి నేల పాడినా కమ్మనైన పాటవా

నింగి నేల పాడినా
కమ్మనైన పాటవా
వెన్నెలింట ఆడినా
అందమైన ఊహవా

నలువైపులా వేనుగానమా
కనుసైఘలా ప్రేమకావ్యమా
చిరుగాలులా సుగందమా
ఇలచేరిన వాసంతమా

కన్నులు సైతం నమ్మని రూపమా
కవితలు సైతం తెలుపని బావమా
వన్నెల చిన్నెల వెలుగుల సంద్రమా
అన్నుల మిన్నుల వలపుల బందమా

మునుపెరుగని సౌందర్యమా
తలపెరుగని ఆనందమా
రవిచూడని నవవర్నమా
ఉలి ఎరుగని తొలిస్వర్నమా

కన్ను మిన్ను కానని
అందమైన స్వప్నమా
నిన్న మొన్న లేధని
వ్యక్తమైన సత్యమా

Wednesday, April 25, 2007

రెక్కలు కట్టుకు సాగనా

రెక్కలు కట్టుకు సాగనా,
ధిక్కులు చీల్చుకు చేరనా,
కమ్మని కలలా కడలిలొ,
వెన్నెల వెలుగుల అలలలొ,
తలపుల వలపుల మన ప్రేమ,
పువ్వుల నవ్వుల హాయే సుమ.

కలువకు వంకకు తెలియని,
మన కధ మలుపొకటుంధని
కొండ కూన ఆలకించని,
కమ్మని స్వరమొకటుంధని.

గొంతుకు చించుకు పాడనా,
మొక్కులు కొరుతు వేడనా,
నమ్మని నిధుల కొలనిలొ,
వన్నెల చిన్నల వెలుగులొ,
మరువని మధురము మన ప్రేమ,
చెరగని కావ్యము మన ప్రేమ.

Tuesday, April 10, 2007

Mana Prema

Rekkalu kattuku saagana,
dhikkulu cheelchuku chaerana,
kammani kalalaa kadalilo,
vennela velugula alalalo,
thalapula valapula mana prema
puvvula navvula haayae suma.

Kaluvaku vankaku theliyani,
mana kadha malupokatundhani
konda koona aalakinchani,
kammani swaramokatundhani.

Gonthuku chinchuku paadana,
mokkulu horuthu vaedanaa,
nammani nidhula kolanilo,
vannela chinnala velugulo,
maruvani madhuramu mana prema,
cheragani kaavyamu mana prema.

కానిది రానిది యేముంది

కానిది రానిది యేముంది
తెలియక తేలనిదేముంది
తరగని చెదరని ఆశే ఉంటే
వీడని మాయని పంతం ఉంటే
నింగీ నేల కలిపే ధైర్యం ఉంటే
భవితను చూసే బాసే ఉంటే


ఊహకి హద్దుంటే కవితేది
ఆశకు అంతుంతే భవితేధి
అర్ధం లేని మౌనం రాగమవ్వధా
ప్రెమే లేని హౄధయం భారమవ్వధా


ఛిరునవ్వుల పువ్వుల వనమే జీవితం
చిగురాశల ఊసుల కడలే జీవితం
వెనుకడుగే వేయ్యక సాగితే
అడుగడుగున సాహసం నిండితే
కానిది రానిది యేముంది
తెలియక తేలనిదేముంది


మరుమల్లెల మధురస్వరమే జీవితం
చిరుజల్లుల చల్లని వరమే జీవితం
నిశ్చయము నిర్భయము కలిస్తే
తదేక ద్యానముతొ సాగితే
కానిది రానిది యేముంది
తెలియక తేలనిదేముంది


ఊహకి హద్దుంటే కవితేది
ఆశకు అంతుంతే భవితేధి
అర్ధం లేని మౌనం రాగమవ్వధా
ప్రెమే లేని హౄధయం భారమవ్వధా

వేగం తరగని మెఘం

వేగం తరగని మెఘం పరుగుల రాగం తీసేనా,
చినుకుల పాటే పాడేనా
మర్మం యెరుగని హృధయం ఉరుకుల పయనం సాగేనా,
వెలుగుల బాటే చేరెనా


కాలం మారిన మారదు సత్యము గెలుపే తధ్యము
మంచికి గెలుపే తధ్యము
ధ్వెషం పెరిగిన తరగధు స్నేహము గెలుపే తధ్యము
చివరికి స్నెహమే విజయము


మనిషికి మనిషే తొడై నిలిచితే సర్వము సాద్యము
ఇక పై సర్వం సాద్యము
మాయలు మొసము తెలియని మనసున శాంతే నిత్యము
యెప్పుడూ శంతి సౌఖ్యము


నలుగురి మాటలు నమ్మక నీతిన సాగే యొధుడు
యెప్పుడు గెలిచె వీరుడు
తనధని కాధని ఆశలు వీడిన మనిషే ధైవము
ఆతడి మనసే ఆలయము