Thursday, July 26, 2007

ప్రేమని లేదని

ప్రేమని లేదని చెప్పలేను
నా లొ ఆశల అలజడిది
నేనని నీవని చెప్పలేను
ఏవొ కొర్కెల ఒరవడిది

వెండి వాన కై వేచిన భూమి ని నెనే
మండుటెండలొ మెరిసిన చినుకై రావే

నేటిని రేపుని నమ్మలేను
కాలం తెలియని సందడిది
రాతని గీతని నమ్మలేను
హౄదయం యెరుగని పండగిది

రెండు కన్నుల నిండిన కలవే నీవే
నిండు గుండెలొ మండిన వ్యదవే నీవే
నా దారిని మరిచి నీ వైపే సాగానే

నీ పెరుని తలిచి ప్రతి పూట గడిపానే

నా గమ్యం నీవని నేనెంతొ మురిసానే
ప్రతి మార్గం నీ గురుతై ప్రతి అదుగు వేసానే

ప్రేమని లేదని చెప్పలేను
ఏదొ తీయని గొడవిది
నెనని నీవని చెప్పలేను
నీడై వీడని చొరవిది

వెండి వెన్నెలే కొరిన సాగరం నేనే
వెచ్చని వెలుగులు కురిపించి పొవే

నేటిని రేపుని నమ్మలేను
గాలం వేసిన ప్రణయమిది
రాతని గీతని నమ్మలేను
రాగం మార్చిన చరనమిది

1 comment:

రాధిక said...

పాట బాగుంది.